మున్సిపల్ ఫలితాలు : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉద్రిక్తత
Jaggayyapeta Municipal Election Counting : జగ్గయ్యపేట నాలుగో వార్డులో వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ (TDP) అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి (Usharani) 14 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
Jaggayyapeta Municipal Election Counting ysrcp demands recounting in jaggaiahpet 4th ward votes: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. జగ్గయ్యపేట నాలుగో వార్డులో వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ (TDP) అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి (Usharani) 14 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే రెండు గంటల తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చి రీ కౌంటింగ్ (Re-counting) చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. అందుకు అధికారుల ఒప్పుకోకపోవడంతో...రీకౌంటింగ్ చేయాలని కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థితో పాటు స్థానిక నేతలు ధర్నాకు దిగారు.
అలాగే 13 వ వార్డులో టీడీపీ అభ్యర్థి, తన సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, లెక్కింపు సరిగా జరగలేదని, మరోసారి కౌటింగ్ చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థి పట్టుబట్టారు. అభ్యర్థి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే ఉదయ భాను దగ్గరుండి రీ కౌంటింగ్ చేయించారు. రీ కౌంటింగ్ లోనూ తెలుగు దేశం అభ్యర్థికి అదే మెజారిటీ వచ్చింది.
Also Read : ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ
అయితే, రీ కౌంటింగ్ సరిగా జరగలేదని, మరోసారి ఓట్లను లెక్కించాలంటూ ఎమ్మెల్యే ఉదయభాను (Udayabhanu Samineni) అనుచరుల ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే ఉదయభాను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడం వివాదం రేపింది. కౌంటింగ్ సెంటర్‌లో గలాటా సృష్టించేందుకు ఎమ్మెల్యే వచ్చారంటూ కలెక్టర్, ఎస్పీలకు టీడీపీ (TDP) నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏజెంట్లను బెదిరించే ధోరణిలో ఉదయభాను వ్యహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో (Jaggayyapeta Municipality) మొత్తం 31 వార్డులకు గాను... 16వార్డుల కౌంటింగ్ పూర్తి అయ్యింది. 16వార్డుల్లో.. 8 వార్డులో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది.
Also Read : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook