AP Municpal elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. నామినేషన్లు పూర్తవడంతో ఏకగ్రీవాల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల పరిధిలో నామినేషన్ల పర్వం ముగిశాక..ఏకగ్రీవాల ఫలితాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మున్సిపల్ ఎన్నిక( Ap municipal elections)ల్లో భాగంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పర్వం ముగిశాయి. ఈ నెల 10న పోలింగ్ జరగనుండగా..14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల పర్వం ( Nominations)ముగియడంతో రంగంలో నిలిచిన అభ్యర్ధులు, ఏకగ్రీవాల సంఖ్య ఇలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 418 నామినేషన్లు దాఖలు కాగా, 2 వేల 9 వందల మంది అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల తరహాలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party) హవాను కొనసాగించింది.


చిత్తూరు కార్పొరేషన్ ( Chithoor corporation) పరిధిలో 50 డివిజన్లలో 30 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో కార్పొరేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాల్టీలు కూడా పార్టీ ఖాతాలో చేరాయి. నగరి మున్సిపాల్టీలో 7 వార్డుల్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా..మదనపల్లి మున్సిపాల్టీలో 16 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 19 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఇక కడప జిల్లాలో 33 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. రాయచోటి  మున్సిపాల్టీలో 31 వార్డుల్ని, ఎర్రగుంట్ల మున్సిపాల్టీలో 12 వార్డుల్లోనూ, బద్వేలు మున్సిపాల్టీలో 10 వార్డుల్ని , ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో 9 వార్డుల్ని, కడప  కార్పొరేషన్ పరిధిలో 23 వార్డుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. 


ఇక కర్నూలు ( Kurnool) జిల్లా డోన్ మున్సిపాల్టీ వైసీపీ కైవసం చేసుకుంది. ఆత్మకూరు మున్సిపాల్టీలోని 15 వార్డుల్ని, కర్నూలు కార్పొరేషన్‌లో రెండు డివిజన్లు, ఎమ్మిగనూరు మున్సిపాల్టీలో 2 వార్డులు, ఆదోని మున్సిపాల్టీలో 9 వార్డులు, నందికొట్కూరు మున్సిపాల్టీలో 4 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు నగర పంచాయితీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయితీలో 2 వార్డుల్ని వైసీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. ప్రకాశం జిల్లా మాచర్ల మున్సిపాల్టీని వైసీపీ గెల్చుకుంది. చీరాల మున్సిపాల్టీలో 3 వార్డులు, గిద్దలూరు మున్సిపాల్టీలో 7 వార్డుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. 


తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాల్టీల్లో వైసీపీ హవా కన్పించింది. రామచంద్రాపురంలో 10 వార్డులు, తుని మున్సిపాల్టీలో 15 వార్డుల్ని ఏకగ్రీవం చేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాల్టీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాల్టీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాల్టీలో 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డుల్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాల్టీలో 3 వార్డుల్ని వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాల్టీలో 9 వార్డుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. 


Also read: AP Municipal Elections 2021: ఏపీ ఎస్ఈసీ Nimmagadda Ramesh Kumar ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook