AP Municipal Elections 2021: ఏపీ ఎస్ఈసీ Nimmagadda Ramesh Kumar ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు

AP Municipal Elections 2021 | కొన్ని చోట్ల తాజాగా నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్తులపై స్టే ఇచ్చింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 3, 2021, 01:33 PM IST
AP Municipal Elections 2021: ఏపీ ఎస్ఈసీ Nimmagadda Ramesh Kumar ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు

AP High Court Gives Stay On State SEC Oders: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల తాజాగా నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన రాష్ట్ర హైకోర్టు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్తులపై స్టే ఇచ్చింది. నామినేషన్ విడుదలై దాదాపు ఏడాది కావొస్తుందని, మరియు కొన్ని చోట్ల బలవంతంపు ఉపసంహరణ జరిగిందని పలు పార్టీల నేతలు ఫిర్యాదులు చేయడంతో పలు చోట్ల కొత్త నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మరో అవకాశం కల్పించారు.

మరోవైపు పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును సమీక్షించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలలో గ్రామ, వార్డు వాలంటీర్ల జోక్యం ఉండరాదని ఆదేశించారు. అందులో భాగంగా వాలంటీర్ల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. తాజా నామినేషన్లు సైతం మార్చి 2న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించారు.  ఈ రెండు విషయాలపై కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు(AP High Court) ధర్మాసనం ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఏపీలో వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

Also Read: SEC vs Nominations: మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఏపీలో పురపాలక ఎన్నికల(AP Municipal Elections 2021)లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు నిషేధిస్తూ విధించిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం గ్రామ వాలంటీర్లపై చాలా ఫిర్యాదు వచ్చాయని, వారిని మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని భావించిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వాలంటీర్ల సేవలు అందించకూడదని ఆంక్షలు విదించారు. ఓటర్ స్లిప్పుల పంపకం, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడం లాంటివి చేయకుండా ఉండేందుకు, వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

Also Read: Dadi Veerabhadra rao: హైకోర్టు అనుమతి లేకుండా ఎస్ఈసీ ఎలాంటి ఆదేశాలివ్వకూడదు

ఎస్ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. వాలంటీర్ల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోకూడదని సైతం ఏపీ హైకోర్టు పేర్కొంది.

Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News