AP New DGP Kasireddy Rajendranath reddy: ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి (Kasireddy Rajendranath reddy)నియమితులయ్యారు. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నారు. గతంలో విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా సేవలందించారు. పలు కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. ప్రస్తుతం ఈయన ఫ్యామిలితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. 


సర్వీసులో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజేంద్రనాథ్‌రెడ్డి. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సవాంగ్ పదవీకాలం 2023 జులై వరకు ఉంది. ఈ లోపు ఆయనను ట్రాన్స్ ఫర్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


Also Read; AP Cabinet Reshuffle: ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారు..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook