AP Zilla Parishads: ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తయింది. ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. మరి ఒక్కొక్క జిల్లా 2-3గా చీలిన నేపధ్యంలో జిల్లా పరిషత్‌ల సంగతేంటి, ప్రభుత్వం ఏం చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు మరి కాస్సేపట్లో అమలు కానున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా విభజించిన నేపధ్యంలో..కొన్ని చోట్ల ఒక్కొక్క జిల్లా రెండుగా, కొన్ని చోట్లు మూడుగా విడిపోయింది. విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి వంటి జిల్లాలు మూడు జిల్లాలుగా విడిపోతే..కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు రెండుగా విడిపోయాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఉన్న జిల్లా పరిషత్‌ల సంగతేంటనే వాదన విన్పిస్తోంది. జిల్లాల విభజన ప్రకారం జిల్లా పరిషత్ సభ్యుల్ని విభజించి..కొత్తగా చైర్మన్ ఎన్నుకునే అవకాశముందా అనే వార్తలు వ్యాపించాయి. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. 


జిల్లాల విభజన జరిగినా రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల వారీగా పరిషత్ విభజన ఉందని తేల్చింది. 13 జిల్లా పరిషత్‌లు యధావిధిగా కొనసాగనున్నాయని స్పష్టం చేసింది. జిల్లాల పునర్విభజన..జిల్లా పరిషత్‌లపై ఏ విధమైన ప్రభావం చూపించదని వెల్లడించింది. ఇప్పుడున్న జిల్లా పరిషత్‌ల పదవీకాలం ముగిసేవరకూ కొనసాగుతాయని తేల్చింది. 


Also read: Ap New District Names: వ్యక్తి పేరుతో ఏర్పడిన తొలి జిల్లా ఏది, ఇప్పుడెన్ని జిల్లాలకు ఆ పేర్లు, కారణమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook