కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యవహారంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోబ్‌ బాబుపై ఓ కేసు నమోదైంది. అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగి అయి వుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కించపర్చే రీతిలో వ్యాఖ్యలు చేశారని తిరుపతికి చెందిన బీజేపీ నేత సామంచి శ్రీనివాస్‌, అశోక్‌ బాబు మీద కర్ణాటక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. బాధ్యాతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం నేరం అవుతుందని సామంచి శ్రీనివాస్ కర్ణాటక ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు.


సామంచి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్‌ బాబు కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.