AP PRC Issue: ఏపీ పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమనిగినట్లు కనపించడం లేదు. స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం చర్చల తర్వాత ఉద్యమం విరమిస్తున్నట్లు చేసిన ప్రకటనపై పలు ఉద్యోగ సంఘాల జేఏసీల నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసి రేపు (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై జేఏసీ నేత బాల కాశి మాట్లాడుతూ.. చెప్పిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ అందరినీ మోసం చేశారని ఆరోపించారు.


జేఎసి నాయకులను లొంగదీసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని విమర్శలు చేశారు. స్టీరింగ్ కమిటీ నేతలను‌ బెదిరించి ఒప్పించారని కూడా ఆరోపణలు చేశారు.


స్టీరింగ్ కమిటీతో జరిగిన ఒప్పందాన్ని చీకటి ఒప్పందంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


ప్రభుత్వం దిగొచ్చిందని భావించాం..


మూడో తేదీన ఛలో విజయవాడతో ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందని భావించామని తెలిపారు బాల కాశి. అయితే లక్షల మంది ఉద్యోగుల నమ్మకాన్ని ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఎసి నేతలు తాకట్టు పెట్టారని ఆరోపించారు.


ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చే పిలుపుతో మేము కలిసి పయనిస్తాం స్పష్టం చేశారు బాల కాశి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతరూ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.


ట్​ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదు..


ప్రభుత్వం ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేదని బాలకాశి అన్నారు. ఈ విషయంలో ఆరుగురు మంత్రులు, ఐదుగురు అధికారులు కమిటీ నిద్ర పోతోందని ఆరోపించారు.


టిడిపి హయాంలోనే మాకు కొంత వరకు న్యాయం జరిగిందని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత ఎంతవరకు తమకు ఎంత వరకు న్యాయం చేసేందో బహిరంగ చర్చకు సిద్దమని వెల్లడించారు.


23 శాతం వేతనం పెంచటం అంటే నెలకు రూ.3 వేలు వస్తాయని తెలిపారు బాలకాశి. గతంలో రూ.8 వేవల వరకు జీతాలు పెంచారని గుర్తు చేశారు


ప్రభుత్వానికి డిమాండ్స్​..


అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కష్టాలు, కన్నీళ్లను గుర్తించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు బాలకాశి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న జగన్ ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగి రాకుంటే భవిష్యత్తులో పోరాటం తప్పదని స్పష్టం చేశారు.


ఇక జేఎసి నాయకులు పెట్టిన. 75 డిమాండ్లలో ఎన్ని సాకారమయ్యాయో చెప్పాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలలో ఒక్కటైనా పరిష్కారం అయ్యిందా అని ప్రశ్నించారు. పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.


Also read: AP Corona cases: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ ప్రభావం - 3 వేల దిగువకు కొత్త కేసులు!


Also read: Ap cm ys jagan: మీరు లేకపోతే నేను లేనంటూ సీఎం జగన్ భావోద్వేగం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook