Voluntary Vehicle Fleet Modernization Policy in Telangana: 15 ఏళ్లు దాటిన వెహికల్స్ స్క్రాప్‌కు అప్పగించాల్సి విషయంపై తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ ఇలంబత్రి కీలక విషయాలను వెల్లడించారు. సొంత వెహికిల్ 15 సంవత్సరాలు దాటిన తరువాత వాలంటీర్‌గా స్క్రాపింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి.. సర్టిఫికెట్ ఇస్తే వచ్చే రెండు సంవత్సరాల్లో కొత్త వాహనాలు సేమ్ వెహికిల్ కొంటే లైఫ్ ట్యాక్స్‌లో ఫీజు తగ్గింపు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని.. అందులో నుంచి బెస్ట్ పాలసీని తీసుకున్నామని తెలిపారు. పాత బకాయిలు ఉన్నా వాహనం స్క్రాప్‌కి తీసుకెళ్తే వన్ టైమ్ సెటిల్మెంట్ చేసేలా అవకాశం ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ప్రభుత్వ వాహనాల ప్రకారం సెక్షన్ 52A ప్రకారం రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయాలని లేదన్నారు.
"15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలు స్క్రాప్‌కి యాక్షన్ ద్వారా పంపించాలి. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ద్వారా వాహనాలు ఆటోమేటిక్ మిషన్‌ల ద్వారా చేస్తాయి. ఎంవీ యాక్ట్‌లో ఉన్న ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం 37 టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవటానికి అనుమతి ఇచ్చింది. జిల్లాలో 33, హైదారాబాద్ నాలుగు అదనంగా పెట్టనున్నాయి. ఒక్కో దానికి 8 కోట్లు అవసరం అవుతాయి.. మొత్తం 296 కోట్లు కేటాయించారు. సారథి వాహాన్ సంవత్సరంలోపు మొత్తం ఇంప్లిపెమెంట్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతుంది.
15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీలో కచ్చితంగా చేసుకోవాలని లేదు.. వాళ్ల ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు 8 సంవత్సరాలలోపు దాటితే ప్రతి సంవత్సరం/త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది." అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు.
అంతకుముందు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రవాణా శాఖలో రెండు మూడు సంస్కరణలు తీసుకువచ్చని.. మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తుందననారు. తెలంగాణలో కూడా సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నామన్నారు. జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నామని.. 15 సంవత్సరాలు మనం వాడే వాహనాలు, 8 సంవత్సరాలు ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీ తీసుకువచ్చామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాహన ఓనర్ మార్పిడి చేసుకోవడానికి ఉందన్నారు.
"వాహనాల చెకింగ్ సరైన విధానం అమలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం.. ఒక్కో సెంటర్‌కి 8 కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నాం.. దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నాం.. రోడ్డు భద్రతాపై యునిసెఫ్ సహకారం తీసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాం.. ఇప్పటివరకు 8 వేల లైసెన్స్‌లు రద్దు చేశాం.. TS నుంచి TG కి మారినప్పుడు TS వాహనాలు మళ్లీ TG గా మారుతాయని చెప్పలేదు.. కొత్త వాహనాలు TG గా వస్తున్నాయి.." అని మంత్రి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter