AP Govt to Launch Own TV News Channel soon says Reports: 2024 ప్రారంభంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్).. 'ఏపీ ఫైబర్ న్యూస్' బ్రాండ్ పేరుతో ఛానెల్‌ని ప్రారంభించనుంది. ఇటీవల జరిగిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ సమావేశంలో ఏపీ ఫైబర్ న్యూస్‌ను ప్రారంభించనున్నామని ఉన్నత స్థాయి అధికారిక వర్గాలు జాతీయ మీడియా పీటీఐకి తెలిపాయట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఫైబర్ న్యూస్ ఛానెల్ 'ఫైబర్-టు-హోమ్' నెట్‌వర్క్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వార్తలను ప్రసారం చేయనుంది. ఛానెల్ ద్వారా ప్రసారం చేయగల ఇతర కంటెంట్‌కు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని, వార్తా ఛానెల్ విధివిధానాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ అధికారులు తెలిపారట. ఛానెల్‌ని స్వంతంగా నిర్వహించాలా లేదా అవుట్సోర్స్ చేయాలా అనే చర్చలు జరుగుతున్నాయట. 


ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం 'సాక్షి' టెలివిజన్ న్యూస్ ఛానెల్ మరియు వార్తా పత్రికను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మూడు ప్రధాన తెలుగు వార్తా ఛానెల్‌లపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు ఛానెల్స్ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాయని మూలాలు తెలుపుతున్నాయి. మరో రెండు టాప్ టూ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్స్ మాత్రం ఏపీ ప్రభుత్వంకు అండగా ఉన్నాయట. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు త‌న వివరాలు చెప్పేందుకు మీడియా రంగంలోకి దిగాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని సమాచారం. 


ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ప్రస్తుతం టెలివిజన్ ఛానెల్‌లు, టెలిఫోన్ లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వంటి సేవలకు ప్రజలకు అందిస్తోంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ 10 లక్షల మంది సభ్యులను కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 50 నుంచి 60 లక్షల కనెక్షన్లకు పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక విజయవంతం అయితే ఏపీ రాష్ట్రంలోని 50 శాతం కుటుంబాలు ఎఫ్‌టిహెచ్ పరిధిలోకి వస్తాయి.


Also Read: అదంతా కనబడుతుందని.. అనన్య పాండే కాళ్లపై విజయ్ దేవరకొండ చేతులేసి మరీ..!


Also Read: Samantha: చైతూతో కలిసి ఉన్న ఇంటిని వదలని సమంత.. భారీ ధర పెట్టి మళ్లీ కొనుగోలు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook