AP Panchayat Election 2021 Final Phase Voting Live Updates: ఏపీలో తుది దశ అయిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా జరుగుతోంది. నాలుగో దశలో ఫిబ్రవరి 21న ఉదయ 6.30 గంటలకు మొత్తం 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు పోలింగ్ జరుగుతున్న 2,743 సర్పంచి స్థానాలకు మొత్తం 7,475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదైంది. ఆ సమయానికి విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదు కాగా, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరులో అత్యల్ప పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు.


Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది


కృష్ణా జిల్లా గన్నవరంలో సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత పెంచారు. గన్నవరం పోలింగ్ కేంద్రంలో ప్రధాన గేటు మూసివేయడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



వర్షంలోనూ ఓటింగ్ కేంద్రాలకు..
నెల్లూరు జిల్లా కోవూరులో భారీ వర్షంలోనూ పోలింగ్ కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ పసిబిడ్డతో పాటు ఓ మహిళ ఓటు వేసేందుకు రావడం స్థానికులలో స్ఫూర్తిని నింపుతోంది. ఓటు హక్కు ఎంత విలువైనదో తెలుపుతుంది.


కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. వార్డు మెంబర్ల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారికి సమస్యను వివరించారు.


స్పృహ తప్పిన సర్పంచి అభ్యర్థి 
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో ఓటు వేసేందుకు వచ్చిన సర్పంచి అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు. బేవన్నహళ్లిలో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన సర్పంచి అభ్యర్థి భాగ్యమ్మ కళ్లుతిరిగి పడిపోవడంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook