Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

 శుక్ర గ్రహం(Venus) ఫిబ్రవరి 21న మకర  రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శుక్రుడు మీ జీవితంపై కొన్ని రోజులపాటు ఎలాంటి ప్రభావం చూపనున్నాడో 12 రాశిల వారి వివరాలు తెలుసుకోండి. ఆనందం, ప్రేమ, శృంగారం మరియు వివాహం లాంటి విషయాలకు కారకుడు శుక్రుడు. ఈ ఆదివారం(ఫిబ్రవరి 21న) శుక్ర గ్రహం తన రాశిచక్రాన్ని మార్చుకోనుంది. ఈ 21న అంటే ఆదివారం మధ్యాహ్నం 2.19 గంటలకు శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించి మార్చి 17 వరకు అదే రాశిలో ఉంటుంది. అదే సమయంలో సూర్యుడు మరియు బుధుడు కూడా ఉన్నాయి

Venus Planet Transit In Aquarius : శుక్ర గ్రహం(Venus) ఫిబ్రవరి 21న మకర  రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శుక్రుడు మీ జీవితంపై కొన్ని రోజులపాటు ఎలాంటి ప్రభావం చూపనున్నాడో 12 రాశిల వారి వివరాలు తెలుసుకోండి. ఆనందం, ప్రేమ, శృంగారం మరియు వివాహం లాంటి విషయాలకు కారకుడు శుక్రుడు. ఈ ఆదివారం(ఫిబ్రవరి 21న) శుక్ర గ్రహం తన రాశిచక్రాన్ని మార్చుకోనుంది. ఈ 21న అంటే ఆదివారం మధ్యాహ్నం 2.19 గంటలకు శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించి మార్చి 17 వరకు అదే రాశిలో ఉంటుంది. అదే సమయంలో సూర్యుడు మరియు బుధుడు కూడా ఉన్నాయి

1 /12

మేషరాశి(Aries) ప్రజలు వ్యాపారంలో శుక్రుడి ప్రభావంతో  ప్రయోజనం పొందుతారు. వివాహ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతరుల చేతిలో చిక్కిన నగదును తిరిగి పొందే అవకాశం ఉంది. ఒకరు శుభవార్త అందుకుంటారు. ఇది కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది మరియు జీవిత భాగస్వాముల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 21, 2021 Rasi Phalalu, ఓ రాశి వారికి ధనలాభం

2 /12

కుంభ రాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశం వృషభ రాశి(Tauras) వారికి ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. ఏదైనా ప్రభుత్వ పనులు నిలిచిపోతే అది పూర్తవుతుంది. ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు పురోగతి మరియు వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు సైతం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు

3 /12

మిథున రాశి వారికి అదృష్టం కలిసిరానుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. చిన్నారులు సంతోషంగా గడుపుతారు. Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

4 /12

కర్కాటక రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కారణం వల్ల పనిచేసే చోట వివాదం తలెత్తవచ్చు. మీకు తెలియకుండానే కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. మరియు మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంది. అయితే ఆచితూచి అడుగు వేస్తే ప్రయోజనం పొందుతారు.

5 /12

శుక్ర గ్రహం(Venus In Aquarius) ప్రభావంతో సింహ రాశి(Leo) వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మత విశ్వాసాలు పెరుగుతాయి. దైవచింతన పెరుగుతుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ మీ మాటలు, భావాలను నియంత్రించుకోవాలి. లేనిపక్షంలో మీకు ఇబ్బందులు, నష్టాలు తప్పవు. Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

6 /12

కుంభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించిన తరువాత నుంచి మార్చి 16-17 వరకు కన్య రాశి(Virgo) వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశివారి వివాహం ఆలస్యం కావచ్చు లేదా వివాహ ప్రతిపాదన వెనక్కి వెళుతుంది. జీవిత భాగస్వామితో విడిపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సైతం ఈ సమయం అంతగా అనుకూలం కాదు. మీరు ఊహించని వ్యక్తుల నుంచి హాని జరుగుతుంది.

7 /12

కుంభరాశిలోకి శుక్రుడి ప్రవేశంతో తుల రాశి(Libra) వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలో హాజరయ్యే విద్యార్థులకు ఈ సమయం కలిసొస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  ఉద్యోగాలు, వ్యాపారంలో మీకు ప్రయోజనాలు ఉంటాయి. చిన్నారులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం

8 /12

వృశ్చిక రాశి(Scorpio) వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలు అందించనున్నాడు. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. మీరు ఇల్లు నిర్మించాలనుకుంటే, అందుకు తగిన సమయం ఇది. మీరు వాహనాలను కూడా కొనుగోలు చేయవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతంది. మీ మాటలు అదుపులో ఉంచుకోకపోతే నష్టం జరగవచ్చు. మీ ఆలోచనలు, నిర్ణయాలను రహస్యంగా అమలు చేయడం ద్వారా పనులు జరుగుతాయి. అప్పుడు మీకు మాత్రమే విజయం లభిస్తుంది.

9 /12

ధనుస్సు రాశి(Sagittarius) వారి ఆరోగ్యాన్ని శుక్ర గ్రహం ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి విడిపోయే పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగం మరియు వ్యాపారం చేసే వారికి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ పనిలో కూడా విజయం లభిస్తుంది. Also Read: Coffee vs Heart: కాఫీ..అతిగా తాగితే ఆ ప్రమాదం పొంచి ఉంటుందట...తాజా పరిశోధన

10 /12

మకర రాశి(Capricorn) వారికి శుక్రుడు శుభాలు కలుగజేస్తాడు. మకరరాశి వారికి ఆకస్మిక ధనలాభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరియు వ్యాపారంలో కూడా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలతో పాటు వైవాహిక జీవితంలో ఉన్న వారికి శుభవార్తలు అందుతాయి.

11 /12

ప్రస్తుతం శుక్ర గ్రహం ప్రవేశిస్తున్నందున ఈ సమయం కుంభ రాశి (Aquarius) వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. భౌతిక ఆనందాలు పెరుగుతాయి. మీరు ఇల్లు మరియు వాహనాలను కొనుగోలు చేసేందుకు తగిన సమయం. ప్రభుత్వ ఉద్యోగానికి చేసిన దరఖాస్తుతో ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకుంటే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధించవు.

12 /12

మీన రాశి (Pisces) వారు ఈ సమయంలో హెచ్చుతగ్గులు ఎదుర్కోనున్నారు. వీరి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. వివాహ సంబంధిత విషయాలలో జాప్యం ఏర్పడుతుంది. విద్యార్థులకు అంతగా అనుకూలించదు.