Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో కీలకమైన తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తిగా ముగిసింది. నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికల్లో..తొలిదశలో ఏకగ్రీవమైన పంచాయితీల వివరాలివే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) పోరు నడుస్తోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరగనుండగా..తొలిదశకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పర్వం ( Nominations ) పూర్తిగా ముగిసింది. నామినేషన్లు దాఖలు తేదీ మొన్ననే ముగిసినప్పటికీ..ఇవాళ్టితో ఉపసంహరణ గడువు కూడా సమాప్తమైంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) గ్రామ స్వరాజ్యంలో భాగంగా ఏకగ్రీవాలపై దృష్టి పెట్టి..పంచాయితీ స్థాయిని బట్టి నజరానాలు ప్రకటించింది. ఇవాళ్టితో తొలిదశ నామినేషన్ల పర్వం పూర్తిగా ముగియడంతో ఏకగ్రీవాల సంఖ్య తేలింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో 659 మండలాల్లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో 173, రెండో విడతలో 169, మూడవ దశలో 171, నాలుగవ దశలో 46 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయితీలు ( Unanimous panchayats ), ఎన్నికల జరగాల్సిన పంచాయితీల సంఖ్య ఇలా ఉంది. 


తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ( First phase Panchayat elections unanimous list )


చిత్తూరు జిల్లాలో 454 పంచాయితీ ఎన్నికలకు గానూ..96 ఏకగ్రీవం


గుంటూరు జిల్లాలో 337 పంచాయితీ ఎన్నికలకు గానూ..67 ఏకగ్రీవం


కర్నూలు జిల్లాలో 193 పంచాయితీల్లో 54 ఏకగ్రీవం


వైఎస్ఆర్ కడప జిల్లాలో 206 పంచాయితీలకు 46 ఏకగ్రీవం


పశ్చిమ గోదావరి జిల్లాలో 239 పంచాయితీలకు 40 ఏకగ్రీవం


శ్రీకాకుళం జిల్లాలోని 321 పంచాయితీలకు 34 ఏకగ్రీవం


విశాఖపట్నం జిల్లాలో 340 పంచాయితీలకు 32 ఏకగ్రీవం


తూర్పు గోదావరి జిల్లాలోని 366 పంచాయితీలకు 28 ఏకగ్రీవం


కృష్ణా జిల్లాలోని 234 పంచాయితీలకు 20 ఏకగ్రీవం


ప్రకాశం జిల్లాలోని 229 పంచాయితీలకు 16 ఏకగ్రీవం


నెల్లూరు జిల్లాలోని 163 పంచాయితీలకు 14 ఏకగ్రీవం


అనంతపురం జిల్లాలోని 169 పంచాయితీలకు 6 మాత్రమే ఏకగ్రీవం


ఏకగ్రీవం కాగా..మిగిలిన పంచాయితీలకు ఫిబ్రవరి 9వ తేదీన ( Panchayat First phase polling ) ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై..ఫలితాలు వెలువడనున్నాయి.


Also read: Election Manifesto: పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమీషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook