ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్‌ -2019 ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఫలితాల్లో 85 శాతం వరకు ఉత్తీర్ణత సాధించగా.. ఇందులో 82 శాతం బాలురు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది. ఏప్రిల్ 30న‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్ష 31 వేల 931 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా లక్షా 24 వేల 899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫలితాల కోసం..


ఈ క్రమంలో పాలిసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు... ఇందుకు సంబంధించిన ర్యాంకులను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. పాలిసెట్ ఫలితాలను www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు


టాప్ 10లో ముగ్గురు బాలికలు
పాలిసెట్ 2019 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. కాగా తూ.గో చెందిన చింత శివ మాధవ్ ఫస్ట్ ర్యాంకు సాధించగా.. గుంటూరు జిల్లాకు చెందిన ఫణి హిరంభనాథ్ రెండో ర్యాంకు సాధించాడు. ఇక మూడో ర్యాంకును తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చందనం విష్ణు కైవసం చేసుకున్నట్లు తెలిసింది