AP Power Crisis: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విద్యుత్ కొరత గానీ విద్యుత్ కోతలు గానీ లేవని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం(AP Power Crisis) అంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ప్రభుత్వం ఇటు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. దసరా అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిస్కమ్ సీఎండీలు స్పందించారు. జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలిపారు. 


ఈ మేరకు సాక్షిలో ఓ కధనం కూడా ప్రచురితమైంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఈనెల 10 నుంచి 14 వ తేదీవరకూ విద్యుత్‌ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్‌ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు(Power Shortage)ఏపీ కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్‌ 14న ఏపీలో 0.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండగా మరుసటి రోజుకి అది పూర్తిగా జీరోకు పడిపోయింది. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా డిస్కమ్‌‌లు పూర్తి స్థాయిలో విద్యుత్‌ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు(Power Cuts)ఉండవని విద్యుత్‌ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్‌ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తల్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (APEPDCL), ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (APCPDCL), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (APSPDCL) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి.


విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. కరెంట్ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. బొగ్గు సంక్షోభం(Coal Crisis) వల్ల తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సమస్య కాదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)చర్యలు తీసుకున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasreddy) తెలిపారు.


Also read: Kurnool Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి