AP PRC Issue: ఏపీ ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం  తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. నేటి (జనవరి 29) సాయంత్రం 6 గంటల్లోపు ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం ట్రెజరీ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. అయితే కొత్త పీఆర్సీపై ట్రెజరరీ ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉండటంతో ప్రభుత్వానికి సహకరించట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం... ట్రెజరీ సిబ్బంది సహకరించని పక్షంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 


కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పీఆర్సీతో (AP PRC Issue) జీతాలు పెరుగుతాయనుకుంటే తగ్గాయని... ఈ పీఆర్సీ తమకు వద్దే వద్దని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపుకు సిద్ధమైంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు వస్తే వారి అపోహలు తొలగిపోతాయని.. ఏ క్షణమైనా చర్చలకు సిద్ధమని ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. 


Also Read: SBI: ప్రెగ్నెంట్ విమెన్ టెంపరరీ అన్‌ఫిట్.. ఆ గైడ్‌లైన్స్‌ను ఉపసంహరించుకున్న ఎస్‌బీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook