AP New Districts News: "పీఆర్సీ, క్యాసినోలను పక్కదారి పట్టించేందుకే ఈ జిల్లాల ప్రతిపాదన"

AP New Districts News: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త జిల్లాల ప్రకటనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఆందోళనలతో పాటు గుడివాడ క్యాసినో వ్యవహారాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 05:32 PM IST
    • ఏపీలో కొత్త జిల్లాల ప్రతిపాదనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందన
    • రాష్ట్రంలో ఉన్న పీఆర్సీ, క్యాసినో వ్యవహారాలను పక్కదోవ పట్టించేందుకేనని వ్యాఖ్య
    • వైసీపీ నేతల కనుసన్నంలో జిల్లా విభజన జరిగిందని మండిపాటు
AP New Districts News: "పీఆర్సీ, క్యాసినోలను పక్కదారి పట్టించేందుకే ఈ జిల్లాల ప్రతిపాదన"

AP New Districts News: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రకటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టారని ఆయన విమర్శించారు. గురువారం తెలుగు దేశం పార్టీ నేతలతో ఆన్ లైన్ సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ప్రభుత్వం నిర్ణయాలను తప్పుబట్టారు. 

ఈ సమావేశంలో కొత్త జిల్లాల ప్రక్రియను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా.. తెలుగు దేశం పార్టీ మాత్రం ఎప్పటికీ ప్రజల పక్షమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. వాటికి అనుగుణంగా తమ పార్టీ నేతలు వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు గుడివాడ క్యాసినో వ్యవహారంలో పోరాటం ఉద్ధృతం చేయాలని ఆదేశించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ సర్కారు బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఉగాది పండుగ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.  

Also Read: AP Corona cases: ఏపీలో ఆగని కరోనా కల్లోలం- ఒక్క రోజులో 9 మంది మృతి!

ALso Read: Secret Treasures in Guntur: ఆలయ తవ్వకాల్లో బయటపడిన గుప్త నిధులు.. అందులో ఏమున్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News