AP Teachers Union Protest : ఏపీ అంతటా కలెటక్టరేట్ల ముట్టడి.. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ డిమాండ్
Teachers Union Protest in AP : ఏపీలో పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నిరసనలకు దిగింది. ఏపీ అంతటా రోడ్లమీదకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు.. కలెటక్టరేట్ల ముట్టడికి దిగాయి.
Teachers Union Protest at Collectorates : ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఫ్యాప్టో.. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కలెటక్టరేట్ల ముట్టడి చేపట్టింది. ఏపీ అంతటా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదకు వచ్చాయి. ఇక కలెక్టరేట్ల (Collectorates) ముట్టడితో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందంటూ పోలీసులు ముందుగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులను అడ్డుకున్నారు.
కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదంటూ పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చారు. అలాగే చాలా చోట్ల గృహ నిర్బంధాలు కూడా చేశారు. నోటీసులు పట్టించుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. అయితే ఫ్యాప్టో తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడికి పలు సంఘాలు మద్దతుగా నిలిచాయి.
కడప జిల్లా మొత్తం కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాల (Teachers Union) నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్‌కు వెళ్తోన్న ఉపాధ్యాయులను కొత్తపల్లె చెక్‌పోస్ట్ వద్దే పోలీసులు అడ్డుకోగా.. వారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇక నెల్లూరు జిల్లాలో అంతటా ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వెంకటగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు (Teachers) ఆందోళనకు చేపట్టారు. మరోవైపు నెల్లూరు కలెక్టరేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉపాధ్యాయులు బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
చిత్తూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు వెళ్తోన్న ఉపాధ్యాయులను పోలీసులు (Police) అరెస్టు చేశారు. కుప్పం, పలమనేరు నుంచి చిత్తూరు వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్టణంలలో ఉపాధ్యాయనేతలను పోలీసులు ముందుస్తుగానే గృహ నిర్బంధం చేశారు. అలాగే కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విజయనగరం కలెక్టరేట్‌లోకి ఉపాధ్యాయులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Also Read : మీ చొరవ నన్ను కదిలించింది... సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్దకు ఉపాధ్యాయులు భారీగా చేరుకుని కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. నేతలకు ముందుస్తుగానే పోలీసులు నోటీసులిచ్చారు. చాలా మంది నేతల్ని గృహనిర్బంధంలో ఉంచారు. ఇలా ఏపీ వ్యాప్తంగా పీఆర్సీ (prc) జీవోలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Also Read : Global Community Oscars: 'గ్లోబల్ ఆస్కార్' జాబితాలో హీరో సూర్య దంపతులకు చోటు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook