Kaikala Satyanarayana: మీ చొరవ నన్ను కదిలించింది... సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ

Kaikala Satyanarayana Letter to CM Jagan: గతేడాది నవంబర్‌లో కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో సీఎం జగన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీ చొరవ నన్ను కదిలించిందంటూ తాజాగా సీఎం జగన్‌కు కైకాల లేఖ రాశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 03:10 PM IST
  • సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ
  • సీఎం చొరవకు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు
  • మీ చొరవ నన్ను కదలించిందని లేఖలో పేర్కొన్న కైకాల
Kaikala Satyanarayana: మీ చొరవ నన్ను కదిలించింది... సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ

Kaikala Satyanarayana Letter to CM Jagan: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. గతేడాది తాను అనారోగ్యానికి గురైన సమయంలో సీఎం జగన్ చూపించిన చొరవ పట్ల కైకాల సంతోషం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో మీరు చూపించిన ప్రత్యేక శ్రద్ధ తనను కదలించిందని సీఎం జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ మేరకు కైకాల సత్యనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

'మీరు బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఫోన్ చేసి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమైనా అందిస్తామని హామీ ఇవ్వడం నన్ను కదలించింది. మీరు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించారు. ఆ క్లిష్ట సమయంలో మీ సహృదయత నాకు, నా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.' అని లేఖలో కైకాల సత్యనారాయణ పేర్కొన్నారు.

'మీరు చూపించిన ఈ చొరవ కళాకారుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల కోసం మీరు చూపించే శ్రద్ధ రాష్ట్రం మీ చేతుల్లో సురక్షితంగా ఉంటుందనే భరోసాను కల్పిస్తోంది. మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని కైకాల పేర్కొన్నారు. తాను సంతకం చేసే స్థితిలో లేని కారణంగా తనకు బదులు తన కుమారుడు లేఖపై సంతకం చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, గతేడాది నవంబర్‌లో అనారోగ్యంతో కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayna) హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కైకాల ఆసుపత్రిలో ఉన్న సమయంలో సీఎం జగన్ వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కైకాల సత్యనారాయణ ఆయనకు లేఖ రాశారు.

Also Read: Varun Tej Lavanya Marriage: నటి లావణ్యతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి.. నెట్టింట ప్రచారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News