AP school holiday today: ఏపీలో భారీ వర్షాలు..ఈ ప్రాంతాల వారు తస్మాత్ జాగ్రత్త.. స్కూళ్లకు సైతం సెలవు..!
AP Rains: ఈరోజు నుంచి ఏపీలో భారీ వర్షాలు మొదలయ్యాయి. స్కూల్లకు సైతం డిస్ట్రిక్ట్ కలెక్టర్లు.. సెలవులు ప్రకటించారు. ఈ ప్రాంతాలలో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏపీలో ఏ ప్రదేశాలలో భారీ వర్షాలు పడనున్నాయి.. ఎక్కడెక్కడ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అన్న విషయం ఒకసారి చూద్దాం..
AP Rains today: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, చత్తీస్ఘడ్ , మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం , ఒడిస్సా, మణిపూర్ , నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్రతో సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు ఏర్పడనున్నాయని స్పష్టం చేసింది.
ముఖ్యంగా దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతం లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రుతుపవనాలు కదిలే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అంతేకాదు కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే ఇప్పటికే అల్పపీడనం ప్రభావం కారణంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దసరా సెలవుల సందర్భంగా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 13 వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఋతుపవనాలు తిరోగమిస్తున్న నేపథ్యంలో స్కూల్ సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పొడగింపు అనేది అన్ని ప్రాంతాల పిల్లలకు కాకుండా కేవలం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆ నాలుగు జిల్లాలలో విద్యాసంస్థలకు ఈరోజు మాత్రమే సెలవులు పొడిగిస్తూ నేడు సెలవు ప్రకటించారు.
ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter