AP Zptc-Mptc Elections: జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎస్ఈసీ నీలం సాహ్ని
AP Zptc-Mptc Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల పర్వం ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. నూతన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
AP Zptc-Mptc Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల పర్వం ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. నూతన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. 2020 మార్చ్ నెలలో ప్రారంభమై కరోనా వైరస్ ( Corona virus )మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు (Zptc-mptc elections)తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh kumar) పదవీ విరమణతో ఇవాళ కొత్త ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమీషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం కొత్త ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని( Neelam sahni)..గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. తరువాత ఎస్ఈసీ నీలం సాహ్నిని ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చించుకున్నారు. జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై సమాలోచన చేశారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని సీఎస్ కోరారు. ఇందులో భాగంగా రేపు రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం జరగనుంది.
Also read: Ys Jagan: బాథ్యత మరింతగా పెరిగిందని గుర్తుంచుకోవాలంటున్న వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook