Ys Jagan: మున్సిపల్ ఎన్నికల్లో లభించిన విజయంతో ప్రజలు ఉంచిన బాథ్యత మరింతగా పెరిగిందనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేయర్లు, డిప్యూటీ మేయర్ల వర్క్ షాప్‌కు ఆయన హాజరయ్యారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress party) ఘన విజయం సాధించింది. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లతో కీలకమైన వర్క్ షాప్ నిర్వహించారు. ముందుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) అభినందనలు తెలిపారు. అనంతరం అందిరికీ దిశానిర్దేశం చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో విజయం సాధించామని..ప్రజలు తమపై ఉంచి బాథ్యత మరింతగా పెరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీలకు 67 పదవులు, మహిళలకు ఏకంగా 52 పదవులు ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని జగన్ చెప్పారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని..రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ కోసం 8 వేల వాహనాల్ని కేటాయించామని చెప్పారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలని..అవినీతి, వివక్ష ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, లాభాపేక్ష లేకుండా మధ్య తరగతివారికి తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు.పేదల కాలనీల్ని ఆహ్లాదకరంగా తీర్దిదిద్దాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. 22 నెలల పాలనలో లక్ష కోట్ల సంక్షేమాన్ని అందించామన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాలన్నారు. రైతులకు మేలు చేసేందుకు ఆర్ బీ కేలు నిర్మించామని వైఎస్ జగన్ తెలిపారు.
Also read: AP SEC Neelam Sahani: ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమీషనర్‌గా బాథ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook