SEC All party meet: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అఖిల పక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ ముగిసింది. సమావేశంలో అడుగడుగునా అడ్జు తగిలిన టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్ఈసీ బయటకు పంపించేశారు. అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల( Ap Municipal elections)పై చర్చించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్( Nimmagadda ramesh kumar) అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి, పద్మజా రెడ్డి, సీపీఐ నుంచి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలి, సీపీఎం నుంచి వైవీ రావు హాజరయ్యారు. ఎన్నికల కోడ్, తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తుల్ని పరిశీలిస్తామని..అన్ని పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్ఈసీ సూచించారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్‌ఈసీతో భేటీ అనంతరం​ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించవద్దని ఎస్‌ఈసీకి సూచించినట్టు చెప్పారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్‌ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్‌ చేసుకుంటామనే రీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తున్న దాడులను నియంత్రించాలని ఎస్ఈసీనీ కోరినట్టు నారాయణ మూర్తి చెప్పారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబు( Chandrababu)పై ఎస్‌ఈసీనే కేసు నమోదు చేయాలని కోరారు. 


మరోవైపు అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్యపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. భేటీలో అడుగడుగునా ఎస్ఈసీ మాటలకు వర్ల రామయ్య అడ్డుపడటంతో పలుమార్లు హెచ్చరించారు. అయినా వర్ల రామయ్య( Varla Ramaiah) పట్టించుకోకపోవడంతో సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యను బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన వర్ల రామయ్య..ఎస్ఈసీ నిమ్మగడ్డ గతంలో ఉన్నట్టు లేరని వ్యాఖ్యానించడం విశేషం.


Also read: SEC on Volunteers: వాలంటీర్లపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook