అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Election commissioner Nimmagadda Ramesh Kumar ) మళ్లీ వివాదానికి తెర లేపారు. జనవరి 8వ తేదీ రాత్రి హఠాత్తుగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Local body Elections schedule ) ప్రకటించి వివాదానికి తెర లేపిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్  విడుదలైంది కాబట్టి ఎన్నికల కోడ్ ( Election code ) అమల్లోకి వస్తుందని..సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో లక్షలాదిమంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకం డబ్బులకు ఇబ్బంది ఎదురైంది. అటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా ఆంక్షలు  విధించారు. 


ఇప్పటికే అమ్మ ఒడి పథకం ( Amma vodi scheme ) కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్షేమ పధకాల ( Welfare schemes )పై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తా వించినా..బడ్జెట్ కేటాయింపుల్లో ఉన్నా రే..పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎస్ఈసీ  ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) జారీ చేసిన ఉత్తర్వుల్లో రాజకీయ అజెండా స్పష్టంగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే హఠాత్తుగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే..ఎస్ఈసీ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ పథకాల్ని నిలిపివేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చాలామంది విమర్శించారు. ఈ నేపధ్యంలో విమర్శల్ని నిజం చేస్తూ పథకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు రావడంతో రాజకీయ కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని అంటున్నారు. 


Also read: AP: ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook