AP Panchayat Elections 2021: ఈ-వాచ్ యాప్ ఆవిష్కరించిన ఏపీ ఎస్ఈసీ, E-Watch Appపై ఊహించని షాక్
AP SEC E-Watch App For Panchayat Elections 2021: ఏపీలో పంచాయతీ ఎన్నికలు 2021 నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ఆవిష్కరించారు. అయితే ఈ యాప్‌ను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
AP SEC E-Watch App For Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేసేందుకు ఎపీ ఎలక్షన్ కమిషన్ ఓ యాప్‌ను రూపొందించింది. ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఆవిష్కరించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు ఈ-వాచ్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) వెల్లడించారు. మొబైల్ ద్వారా, కంప్యూటర్ ద్వారా ఈ-వాచ్ యాప్(E-Watch App)లో ఫిర్యాదు చేయవచ్చునని, తాము ఫిర్యాదులు స్వీకరించి సమస్య పరిష్కారం చేయనున్నామని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
ప్రలోభాలు, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా ఇంటి వద్ద ఉండి యాప్ నుంచే ఫిర్యాదు చేయాలని ఏపీ ఎస్ఈసీ సూచించారు. అయితే ఏపీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్(E-Watch App)పై అధికార వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ప్రైవేట్ యాప్ అని, ప్రభుత్వ యాప్ కాదని వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు చెబుతున్నారు.
Also Read: Ap Panchayat Elections 2021: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సమాప్తం
కాగా, ఏపీ ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ఈ-వాచ్ యాప్(E-Watch App)ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. గురువారం నాడు మరోసారి దీనిపై విచారణ జరగనుంది.
Also Read: Atchannaidu Arrest: ఏపీ TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, Chandrababu ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook