Ap Panchayat Elections 2021: వివాదం..కోర్టు పంచాయితీ..ఆరోపణలు..ప్రత్యారోపణల మధ్య ఏపీ పంచాయితీ ఎన్నికల్లో తొలిదశలో కీలక ఘట్టం ముగిసింది. తొలిదశ నామినేషన్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో స్థానిక సంస్థల ఎన్నికల ( Local Body Elections ) పంచాయితీ నుంచి ప్రారంభమైన వివాదం పంచాయితీ ఎన్నికల ( Panchayat Elections ) వరకూ సాగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap Government ), ఎన్నికల కమీషన్ ( Election Commission) కు మధ్య రేగిన వివాదం చివరికి సుప్రీంకోర్టు ( Supreme Court ) తీర్పుతో కొలిక్కి వచ్చింది. నాలుగు దశల్లో జరగనున్న ఏపీ పంచాయితీ ఎన్నికల ప్రక్రియలో తొలిదశకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది.
తొలివిడత పంచాయితీ ఎన్నికల నామినేషన్లు ( First phase nominations ) ఇవాళ్టితో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 168 మండలాల్లో 3 వేల 249 పంచాయితీలు, 32 వేల 504 వార్డులకు మొదటిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న జరగనున్న పోలింగ్ కు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. ఫిబ్రవరి 3న నామినేషన్ల స్క్రూటినీ , ఫిబ్రవరి 4వ తేదీ మద్యాహ్నం ఉపసంహరణ ఉంటుంది. సర్పంచ్ పదవులకు సంబంధించి 13 వేలకు పైగా నామినేషన్లు దాఖలు కాగా..వార్డు మెంబర్ పదవులకు 35 వేలకు పైగా నామినేషన్లు ( Nominations ) వచ్చాయి. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6.30 గంటల్నించి మద్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ ( Polling ) కొనసాగుతుంది. అనంతరం 4 గంటల్నించి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ap Panchayat Elections 2021: తొలి విడత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సమాప్తం
ముగిసిన తొలిదశ పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, ఫిబ్రవరి 4న ఉపసంహరణ
సర్పంచ్ పదవులకు 13 వేల పైచిలుకు, వార్డు మెంబర్ పదవులకు 35 వేలకు పైగా నామినేషన్లు
ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి