RTI Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు అధికమౌతున్నాయి. ఆయన చర్యలు ప్రమాదకరంగా మారాయని ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Ap Sec Nimmagadda Ramesh Kumar )‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆర్టీఐ మాజీ కమీషనర్, ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం ఛైర్మన్ విజయబాబు ( Rti Ex commissioner Vijaya babu ) ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. పరిధి దాటి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు అసెంబ్లీ సభాహక్కుల కమిటీ ద్వారా నోటీసులివ్వాలని..కమిటీ ముందు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమీషనర్, ప్రభుత్వం ( Ap Government ) మధ్య జరుగుతున్న పరిణామాలపై విజయవాడలో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పు అనంతరం ఏం చేసినా చెల్లుతుందనేలా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని తెలిపారు. 


ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారమంతా కక్ష సాధింపుగానే ఉందని మండిపడ్డారు. మంత్రులకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పడం, ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy ) ని తొలగించాలనడం ద్వారా నిమ్మగడ్డ తన పరిధిని పూర్తిగా అతిక్రమించారని ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు స్పష్టం చేశారు. ప్రజా పరిపాలనకు ఆయన అవరోధం సృష్టిస్తున్నారని విమర్శించారు. గతంలో ఓసారి మహారాష్ట్ర ( Maharashtra ) ఎన్నికల కమీషనర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కచేయకపోతే..అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ..గవర్నర్, కోర్టును సంప్రదించేందుకు సమయం ఇవ్వకుండా అరెస్టు చేయించిన సంగతిని గుర్తు చేశారు. 


Also read: Atchannaidu Arrest: ఏపీ TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, Chandrababu ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook