ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కేసులు ( Corona cases ) తగ్గుముఖం పడుతున్నాయి. అటు నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో కరోనా వైరస్ ( Coronavirus ) కాస్త నియంత్రణలో వచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో కేసుల వివరాలతో తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో నిన్నటి కంటే అత్యధికంగా 68 వేల 829 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7 వేల 553 కొత్త కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం సంఖ్యతో పోలిస్తే చాలా తగ్గుముఖం పట్టిందని అధికార్లు చెబుతున్నారు. గత 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో ట్రూనాట్ పద్ధతిలో 28 వేల 224, ర్యాపిడ్ టెస్టింగ్ లో 40 వేల 605 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసుల సంఖ్య 6 లక్షల 39 వేల 302కు చేరుకుంది. ఇందులోంచి 5 లక్షల 62 వేల 376 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71 వేల 465గా ( Active cases in ap ) ఉంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 10 వేల 555 మంది కోలుకున్నారు. 


రాష్ట్రంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 51 మంది ప్రాణాలు కోల్పోగా...ఇప్పటివరకూ 5 వేల 461 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ దేశంలోనే అత్యధికంగా 52 లక్షల 29 వేల 529 పరీక్షలు నిర్వహించారు. Also read: TTD Declaration: తిరుమల డిక్లరేషన్ పై పెరుగుతున్న వివాదం