AP Corona Update: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపు
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కేవలం 3 వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రమంతా కర్ఫ్యూ వేళల్లో పెద్దఎత్తున సడలింపు ఇస్తున్నారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కేవలం 3 వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రమంతా కర్ఫ్యూ వేళల్లో పెద్దఎత్తున సడలింపు ఇస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి ఏపీలో తగ్గుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో కేవలం 2 వేల 925 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో 26 మంది చనిపోగా..3 వేల 937 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 75 వేల 35మందికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29 వేల 262 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా 12 వేల 986 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 28 లక్షల 94 వేల 611 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లో కేవలం నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల్నించి సాయంత్రం 7 గంటల వరకూ కర్ఫ్యూ వేళల్లో సడలింపు(Curfew Relaxations)ఇచ్చారు.
Also read: Coronavirus on children: కరోనా ప్రభావం చిన్నారులపై ఏ మేరకు, యూకే అధ్యయనం ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook