Ap Skill Development Case: చంద్రబాబుకు భారీ షాక్..బెయిల్ పిటిషన్లు కొట్టివేత!
Ap Skill Development Case: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హై కోర్ట్ కొట్టేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంబంధించిన తీర్పు కూడా ఈ రోజు మధ్యాహ్నం కోర్టు వెల్లడించనుంది.
Ap Skill Development Case: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది..ఇటీవలే హైకోర్ట్‌లో దాఖల చేసిన మూడు ముందస్తు బెయిల్‌లకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇటీవలే ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్, అంగళ్లు కేసులపై దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఏపీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై కూడా ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించునుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీపై కోర్ట్ తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ నిర్ణయం ఉత్కంఠ..
హైకోర్ట్ చంద్రబాబు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన తరుఫున న్యాయవాదులు సుప్రీంకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన జరిగిన విచారనలో భాగంగా సెక్షన్ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై వాదనలు కూడా జరిగాయి. ఈ రోజు మధ్నాహ్నం ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటీషన్, కస్టడీ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించునుంది. ఈ తీర్పుపై ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే హైకోర్ట్‌లో తీర్పు రావడంతో సుప్రీం కోర్ట్, ఏసీబీ కోర్టులో వచ్చే తీర్పు పై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి