AP SSC Results 2022: ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదవగా... మళ్లీ అంత తక్కువ స్థాయిలో కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తమను పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాటల యుద్ధానికి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు.. జగన్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్ అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అమ్మ, ఒడి సంక్షేమ పథకాలకు విద్యార్థులను తగ్గించే కుట్ర అని అభివర్ణించారు. తొలిసారి నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌తో వైసీపీ ప్రభుత్వం అభాసుపాలైందన్నారు. పరీక్షా ఫలితాలు వాయిదా పడటం, ఉత్తీర్ణత తగ్గడం సర్కారు కుత్రంతమేనని ఆరోపించారు. నాడు నేడు పేరుతో రూ.3500 కోట్లు మింగి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.


టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీ వేయడంలో చూపిన శ్రద్ధ విద్యపై పెట్టలేదన్నారు. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందన్నారు. గత 20 ఏళ్లలో ఇదే అతి తక్కువ ఉత్తీర్ణత అని... 71 స్కూళ్లలో జీరో పాస్ అని... ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. 


లోకేష్‌కు విజయసాయి రెడ్డి కౌంటర్ :



పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గడానికి సర్కారే కారణమంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి 'నారాయణ' ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారమే కారణం పప్పు నాయుడు అంటూ లోకేష్‌పై సెటైర్స్ చేశారు. పిల్లలను అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదేనని... దిగజారి ఆరోపణలు చేయడంలో నువ్వు ముందుంటావని విమర్శించారు. చదవు'కొన్న'వాడివి నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు.





Also Read;  Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు


Also Read: JP NADDA AP TOUR: బీజేపీతో జనసేన కటీఫేనా? పవన్ పొత్తులపై జేపీ నడ్డా తేల్చేస్తారా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook