AP SSC Results 2022 is out: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉతీర్ణత శాతం 67.26గా ఉంది. టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. టెన్త్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు మంత్రి బొత్స చెప్పారు.
పదో తరగతి పరీక్షల కోసం మొత్తంగా 6,22,537 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వారిలో బాలికలు 3,02,474 మంది కాగా.. బాలురు 3,20,063 మంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది.
పదో తరగతి పరీక్షలలో 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇక జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా ఇస్తామని ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook