ఏపీ టీడీపీ ఎంపీలు ( Ap Tdp MPs ) గురువారం  రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ( President Ramnath Kovind ) తో భేటీ అయ్యారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై ఆయనతో చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలకు దిగుతోన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రపతి  రామ్‌నాధ్  కోవింద్‌ను కలిసి రాష్ట్రంలోని పరిణామాల్ని విశదీకరించాలని భావించింది. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి కోవింద్ ( Ramnath Kovind )  టీడీపీ ఎంపీలకు సమయం ఇవ్వడంతో ఎంపీలు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) , కేశినేని నాని ( Kesineni Nani ) , గల్లా జయదేవ్ ( Galla Jayadev ) లు ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ టైమ్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను టీడీపీ ఎంపీలు కలిశారు. గత 13 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, టీడీపీ నేతలపై దాడులు, కేసుల వ్యవహారంపై టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని..భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాధ్‌కు స్పష్టం చేశారు. ముఖ్యంగా టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్టు వ్యవహారంపై రాష్ట్రపతి కోవింద్‌తో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. Also read: AP: కొత్త జిల్లాలకు రంగం సిద్ధం, కమిటీ ఏర్పాటు