ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్ టికెట్లు aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 10 నుంచి 21వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయన్న ఆయన వెబ్‌సైట్‌‌లో మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. అటు ఆప్షన్లు ఎంచుకున్న వారికి, ఎంచుకొని వారికి దగ్గరలోనే సెంటర్లను కేటాయించామని.. ఏవైనా సందేహాలుంటే 9505619127, 9505780616 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఆప్షన్లు పెట్టుకోవాలని మే 24 నుంచి 30 వరకు అభ్యర్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపామని తెలిపారు. తమిళనాడులో 2, హైదరాబాద్‌లో 6, బెంగళూరులో 4 పరీక్షా కేంద్రాలను కేటాయించామన్నారు.


హాల్ టికెట్లు డౌన్‌లోడ్:


  • దశ1: అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.inను సందర్శించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

  • దశ 2: డౌన్‌లోడ్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.

  • దశ3: రిఫరెన్స్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.

  • దశ 4: సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.  

  • దశ 5: హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.