AP Weather Update: ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ  దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారునుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని  ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు  దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 26, 2024, 06:47 AM IST
AP Weather Update: ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు.  కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. వరి పంటను కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావవరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రెండు రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే నేప‌థ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా   త‌మిళ‌నాడు,  శ్రీ‌లంక వైపు క‌దులుతూ వాయుగుండంగా మారే అవ‌కాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో APలో  27 నుంచి  29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం నవంబర్‌  27క ల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా బలపడుతుందని  వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణం శాఖ హెచ్చరించింది.

ఐఎండీ, జీఈపీఎస్ ప్రకారం  రాత్రికి వాయుగుండంగా మారి 26 (ఈ రోజు)  సాయంత్రానికి  బలపడనుంది.  తరువాత మయన్మార్ వైపు గా వెళుతుంది. ఎన్సీఈపి మోడల్ ప్రకారం కూడా వాయుగుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయువ్యంగా పయనించి, మయన్మార్ వైపు మళ్లే అవకాశాలున్నాయట. ప్రస్తుతం ఖరీఫ్‌లో  రాష్ట్రం అంతటా వరి ఎక్కువగా పండింది. కోతలు సాగుతున్నాయి. రబీ పంటలు మొలక మొక్క దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిస్తే నష్టం పోయే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో నవంబర్​  27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News