AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఉక్కుకు కేరాఫ్ ప్లాట్‌ఫామ్‌గా మారనుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా పెద్దఎత్తున స్టీల్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీకు సుదీర్ఘ సముద్రతీరం, ఎక్కువ సంఖ్యలో పోర్టులు, రైల్ కనెక్టివిటీ ఉండటంతో భారీ పరిశ్రమలకు అనువుగా ఉంటోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం(AP Government)తీసుకుంటున్న ప్రత్యేక చర్యల ఫలితంగా పెద్దఎత్తున ఉక్కు కంపెనీలు ముందుకొస్తున్నాయి.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉక్కు ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరేందుకు ఎస్సార్ స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. 3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటవుతున్న యూనిట్ పనుల్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నారు. మరోవైపు నెల్లూరు కృష్ణపట్నం (Krishnapatnam)రేవుకు సమీపంలో 7 వేల 5 వందల కోట్ల పెట్టుబడితో 2.25 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో జిందాల్ స్టీల్ కంపెనీ రానుంది.ఇక దక్షిణ కొరియాకు చెందిన పోక్సో కూడా కృష్ణపట్నం వద్ద స్థలాల్ని పరిశీలించింది. మరోవైపు హ్యూందయ్, గ్రీన్‌టెక్ వంటి సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 


ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం ఏపీ ఐదవ స్థానంలో ఉండగా..త్వరలో 2-3 స్థానాల్లో రానుందని తెలుస్తోంది. మొదటి నాలుగు స్థానాల్లో ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌(RINL)తో పాటు చిన్న చిన్న కంపెనీలు మొత్తం 33 ఉక్కు తయారీ (Steel Companies)పరిశ్రమలున్నాయి. ఇవన్నీ కలిపి ఏడాది 8.4 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. 


Also read: AP Nominated Posts: ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టుల ప్రకటన, మహిళలకే అగ్రతాంబూలం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook