Check your Vote: మీ ఓటు ఉందో లేదో చూసుకున్నారా, ఎలా చెక్ చేసుకోవాలంటే
Check your Vote: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. మరి ఆ జాబితాలో మీ ఓటు హక్కు ఉందో లేదో చెక్ చేసుకున్నారా..ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
Check your Vote: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా విడుదల చేయడంతో అన్ని పార్టీలు తమ తమ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఎవరెవరి ఓట్లు ఉన్నాయి, ఎవరివి లేవనేది పరిశీలిస్తున్నారు. మీరు కూడా మీ ఓటు హక్కు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.
ఓటు వేయడం ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎన్ని పనులున్నా లేకపోయినా ఓటు వేయడం మర్చిపోకూడదు. ఏపీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://ceoandhra.nic.in/ceoap_new/ceo/SSR_2024.html ఓపెన్ చేసి మీ ఓటు హక్కు ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది ఓట్లు ఎగిరిపోయాయి. కారణం అడ్రస్ మారినందువల్ల వెరిఫికేషన్‌లో ఎవరూ లేకపోతే ఓటు హక్కు తొలగిస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకుని అన్ని ఓట్లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఓటు హక్కు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలంటే..ఇలా చేస్తే చాలు..
ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ముందుగా ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://ceoandhra.nic.in/ceoap_new/ceo/SSR_2024.html ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో PDF Electoral Roll క్లిక్ చేసి Final SSR Electoral Roll 2024 క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీ పోలింగ్ బూత్ పేర్లతో జాబితా కన్పిస్తుంది. మీ పోలింగ్ బూత్ గుర్తుంటే ఆ బూత్ దగ్గర డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే మొత్తం మీ పోలిగ్ స్టేషన్‌లో ఉండే ఓట్లన్నీ కన్పిస్తాయి. అందులో మీ ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు.
పోలింగ్ బూత్ ఏదనేది గుర్తు లేకుంటే..హోమ్ పేజ్‌లో Search Your Name ఆప్షన్ ఎంచుకుని అందులోంచి వోటర్ పోర్టల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు కుడి చేతివైపున సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అని కన్పించే బాక్స్ క్లిక్ చేస్తే...మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొబైల్ నెంబర్ ద్వారా లేదా పేరు, తండ్రి పేరు, జెండర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా లేదా ఈపీఐసీ నెంబర్ ద్వారా వెంటనే చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా చేయడం చాలా సులభం. ఇందులో కేవలం రాష్ట్రాన్ని ఎంచుకుని..మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేస్తే చాలు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ ఓటు, పోలింగ్ స్టేషన్, సీరియల్ నెంబర్ వివరాలు కన్పిస్తాయి.
Also read: Teeth Pain Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా, ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook