Ap Voter List 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన తరువాత ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల తుది జాబితా వెలువరించింది. పురుషులతో పోలిస్తే మహిళాధిక్యత కన్పిస్తోంది ఓటర్ల జాబితాలో. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల తుది జాబితాను నిన్న ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 మంది ఓటర్లు ఉంటే..అందులే మహిళా ఓటర్లు 2 కోట్ల 7 లక్షల 29 వేల 452 మంది ఉన్నారు. ఇక పురుషులు 2 కోట్ల 74 వేల 322 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా తెలుస్తోంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 6 లక్షల 55 వేల 230 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం ఆనందించే అంశమే అయినా అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలి. 


ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మహిళా ఓటర్ల ఆధిక్యం ఉన్నది 24 జిల్లాల్లో. రెండు జిల్లాల్లో మాత్రమే పురుషులు అదికంగా ఉన్నారు. ఓటర్ల తుది జాబితా పరిశీలిస్తే ప్రతి వేయి మంది ఓట్లకు పురుషులు 1036 మంది ఉంటే..పురుషులు 722 ఉన్నారు. టాన్స్‌జెండర్ ఓట్లు అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యదికంగా 312 మంది ఉంటే..అత్యల్పంగా కోనసీమలో 17 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 3, 482. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9 లక్షల 92 వేల 397 మంది మహిళా ఓటర్లు ఉంటే..అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 లక్షల 83 వేల 640 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నది శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే. మిగిలిన అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ. 


రాష్ట్రంలో 2019 ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 94 లక్షల 5 వేల 967 ఉంటే ఈసారి 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 ఉంది. అంటే గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య స్వల్పంగాపెరిగింది. ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య 67 వేల 434 ఉంది. ఇంతకుముందు ప్రకటించిన ముసాయిదా జాబితా నుంచి 16 లక్షల 52 వేల 422 మందిని తొలగించారు. ఎందుకంటే ఇందులో 5 లక్షల 84 వేల 810 మృతులుగా ఉంటే..8 లక్షల 47 వేల 421 వలస ఓట్లున్నాయి. డబుల్ ఎంట్రీ ఓట్లు 2 లక్షల 20 వేల 191 ఉన్నాయి. ఇది కాకుండా నామినేషన్ వేసేంతవరకూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఇంకా మిగిలుంది. 


Also read: AP Elections 2024: ఏపీలో ఈసారి అధికారం ఎవరిది, సంచలనం రేపుతున్న తాజా సర్వే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook