IMD Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. ఫలితంగా ఇవాళ్టి నుంచి 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ ఆవర్తనం బలపడితే వర్షాలు ప్రారంభం కావచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకూ సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఒకటి రెండ్రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు ఈ నెల 15, 23 తేదీల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా రేపట్నించి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టానికి 5.8-7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నందున వరుసగా నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. పిడుగులు పడే ప్రమాదమున్నందున రైతులు, కూలీలు, చెట్ల కింద, పొలాల్లో తిరగవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. 


ఇక బంగాళాఖాతంలో ఈ నెలలో ఏర్పడనున్న మూడు అల్పపీడనాల కారణంగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ నెల 23న ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదముంది. మొత్తానికి జూలై నెలలో అదిక వర్షపాతం నమోదు కావచ్చు.


Also read: Diabetes Early Signs: రాత్రి వేళ కన్పించే డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook