చిత్తూరు జిల్లాలో రూ.1200 కోట్లతో నిర్మించనున్న అపోలో టైర్ల పరిశ్రమకు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రెండో దశలో రూ.4500 కోట్లతో విస్తరించనున్న ఈ ప్లాంట్ ‌వల్ల 1350 మందికి పైగా ఉపాధి లభించనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పాటు ప్రముఖ పరిశ్రమలు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు దశల్లో ప్లాంట్ పూర్తైతే ప్రస్తుతం దేశంలో ఉన్న అపోలో ప్లాంట్లలోనే ఇది పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం. ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పటికే ఆసియాలోనే అతి పెద్ద పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది.


కార్గొలో కూడా గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే కీలకంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక హబ్స్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇలాంటి పరిశ్రమలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని... ప్రపంచంలోనే ఉత్తమ వ్యాపార, పెట్టుబడుల గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌‌ని నిలుపుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.