ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (AP Group-1 Mains Exam) ఊహించిటనట్లుగానే మరోసారి వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఏపీ గ్రూప్-1 నిర్వహించాల్సి ఉంది. అయితే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా (APPSC Group-1 Mains Exam postponed) వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గ్రూప్-1 పరీక్షల తాజాగా షెడ్యూల్‌ను అక్టోబర్ 29న ఖరారు చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో దొర్లిన తప్పులను సరిదిద్దకుండానే మెయిన్స్ హాల్ టికెట్లు జారీ చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. సవరించిన కీ విడుదల చేసి అనంతరం మెయిన్స్‌కు అర్హుల జాబితాను ప్రకటించిన తర్వాతే ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.



 


కాగా, ఏపీలో 169 గ్రూప్ 1 పోస్టులకు గతేడాది స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షకు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ లెక్కన మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా ముగించాలని భావించిన ఏపీపీఎస్సీ కీ లో అభ్యంతరాలను అంతగా పట్టించుకోకుండా మెయిన్స్ నిర్వహణకు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఇటీవల మెయిన్స్ కోసం హాల్ టికెట్లు సైతం జారీ చేయడం తెలిసిందే. 


 Also Read : SBI Clerk Prelims Result 2020: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe