APPSC Group-1 Mains Exams: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. తొలిసారి ఆ విధానం అమలు
Group-1 Mains Exams in AP: శనివారం నుంచి ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
Group-1 Mains Exams in AP: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6455 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారని.. 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్‌తో కలిసి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న కేంద్రాలను పరిశీలించారు. శనివారం నుంచి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతిస్తామన్నారు.
"బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నాం.. 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశాం. ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం.. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తాం.. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశాం.. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్‌కు అనుమతి కోరారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం.." అని ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ తెలిపారు.
కాగా.. ఇటీవలె గ్రూప్-1, 2 ఉద్యోగార్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి 900కిపైగా పోస్టులు.. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Telangana Formation Day Celebrations: 4 లక్షల కోట్లు ఇస్తే.. ఆ నలుగురే దోచుకున్నారు: బండి సంజయ్ ఫైర్
ఈ పోస్టులకు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి. గ్రూప్-1, 2 నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి