APPSC Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 సర్వీసుల భర్తీకు ఇప్పటికే నోటిఫికేష విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 92 సర్వీసుల భర్తీకు ఈ నోటీఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు తాజాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, ఆన్‌లైన్ దరఖాస్తు వివరాల్ని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీపీఎస్పీ విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించి 92 గ్రూప్ 1 సర్వీసులు భర్తీ కానున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్ 18వ తేదీన ఉంటుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండనుంది. ఇక మెయిన్స్ పరీక్ష 2023 మార్చ్ 15 తరువాత నిర్వహించనున్నారు. గ్రూప్ 1 పరీక్ష పూర్తిగా సివిల్స్ విధానంలో ఉంటుంది. సిలబస్ కూడా ఈసారి ఎక్కువే ఉంటుంది. 


ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు ఆన్‌‌లైన్ దరఖాస్తులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా అంశంలై డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు పోస్టును బట్టి 2022 జూలై 1 నాటికి 18-42 ఏళ్ల మధ్యలో ఉండాలి. నవంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కేటగరీ అభ్యర్ధులు దరఖాస్తుకు 370 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులు 120 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: Heavy Rains Alert: ఏపీలోని ఆ ప్రాంతాల్లో ఇవాళ అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook