Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
ఈ అల్పపీడనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించి నైరుతి దిశవైపుకు వంగి ఉంది. ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకూ విస్తరించి ఉంది. ఫలితంగా రానున్న 3 రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాకుల పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చు.
మరోవైపు ఏపీలో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడవచ్చు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. సముద్రం అలజడిగా ఉండనుండటంతో రానున్న మూడ్రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.
Also read: CM Jagan: మరోమారు పెద్ద మనసు చాటిన ఏపీ సీఎం జగన్..చిన్నారి వైద్యానికి కోటి సాయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook