APSRTC employees: ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి గుడ్ న్యూస్
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలోనే ఏ ఆరోగ్య బీమా సంరక్షణ ( Health insurance ) లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నామని.. అందుకే తమకు కొవిడ్-19 బీమా ( COVID-19 insurance ) వర్తింపజేయాలని ఏపీఎస్ ఆర్టీసీ గత కొద్ది రోజులుగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
అమరావతి: కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలోనే ఏ ఆరోగ్య బీమా సంరక్షణ ( Health insurance ) లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నామని.. అందుకే తమకు కొవిడ్-19 బీమా ( COVID-19 insurance ) వర్తింపజేయాలని ఏపీఎస్ ఆర్టీసీ గత కొద్ది రోజులుగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల ( APS RTC staff ) డిమాండ్‌కు ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఆర్టీసీలో పనిచేసే సిబ్బందికి రూ.50 లక్షల కొవిడ్-19 బీమా ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. Also read : SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ( PM Garib kalyan yojana ) ప్యాకేజీని ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన 36 మంది సిబ్బందికి ఈ బీమా ప్రయోజనాలు ( COVID-19 insurance benefits ) వర్తించనున్నాయి. Also read : Kormo jobs app: ఉద్యోగం కావాలా ? ఈ మొబైల్ యాప్ ట్రై చేయండి అంటున్న గూగుల్
ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కరోనావైరస్తో చనిపోయిన వారి పూర్తి వివరాలు, వారి ఉద్యోగం, మరణ ధృవపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆర్టీసీ ఎండీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ సిబ్బందికి ( APSRTC employees ) కూడా కొవిడ్-19 ఆరోగ్య బీమా వర్తింపజేయడంపై కార్మిక పరిషత్ సహా ఇతర ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ మేరకు వారు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. Also read : Adipurush: ఆదిపురుష్‌లో విలన్ పాత్రకు స్టార్ హీరో
Also read : Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?