APSRTC Employees Strike: సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు.. ఏపీలో ఆ రోజు నుంచి బస్సులు బంద్?
APSRTC Employees Strike: ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఏపీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన మెమోరాండంను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు అందజేశాయి.
APSRTC Employees Strike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు చేపడుతున్నారు. అయితే వీరికి సంఘీభావంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు బహిరంగ ప్రకటన చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు ఆయా ఉద్యోగ సంఘాలు మెమోరాండం సమర్పించాయి.
ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన మెమోరాండంలో ఆర్టీసీ ఉద్యోగులు 45 సమస్యలను ప్రస్తావించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు అందులో కోరారు. వాటిని పరిష్కరించని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారం లభించని క్రమంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి తాము సమ్మెబాట పడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
అయితే ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనానికి ముందు అందులో పనిచేసే కార్మికులకు నాలుగు సంవత్సరాలుకు ఒకసారి పీఆర్సీ వచ్చేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తమకు పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాము ఎందుకు విలీనం కోరుకున్నామా? అని బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: AP Night Curfew: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. అప్పటి వరకు అమలులో కొవిడ్ ఆంక్షలు!
Also Read: AP PRC Issue: ఆన్‌లైన్‌లో ఏపీ ఉద్యోగుల కొత్త జీతాలు, పెన్షనర్ల పెన్షన్ స్లిప్స్ రెడీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook