ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలను హై రిస్క్ రాష్ట్రాలుగా గుర్తించింది. ఈ క్రమంలో కర్ణాటక నుంచి ఏపీకి బస్సులో వెళ్లాలనుకునేవారికి ఓ చేదువార్త. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. జులై 15వ తేదీ నుంచి జులై 23 వరకు బెంగళూరు, కర్ణాటక నుంచి ఏపీకి బస్సు సర్వీసులు నిలిచిపోతాయి. కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది. ప్రతీకారంతోనే పోలీసులను హత్య చేసిన వికాస్ దుబే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం దాదాపుగా 140 బస్సు సర్వీసులు ఈ రోజుల్లో పని చేయవు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు బస్సులు నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి జులై 23 వరకు మాత్రే సర్వీసులను ఆపివేసినట్లు చెప్పారు. ఇదివరకే ఎవరైనా టికెట్లు బుక్‌ చేసుకుంటే, ఆ ప్రయాణికులకు వారి డబ్బు రీఫండ్ చేయనున్నారు. AP: ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు


కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అధికంగా టెస్టులు నిర్వహిస్తోంది. ఇటీవల వెయ్యికి పైగా అధునాతన అంబులెన్స్‌ సర్వీసులను ఏపీ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి టెస్టుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. క్వారంటైన్ రూల్స్‌పై సైతం స్పష్టత ఇవ్వడం తెలిసిందే.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..