రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. గత వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో రాష్ట్రంలోని 5 జిల్లా లాక్డౌన్ (LockDown In AP) నిబంధనలు కొనసాగించాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ (AP LockDown) రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఆంక్షలు విధించడం తెలిసిందే. ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
పశ్చిమ గోదావరిలో భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పారు. కేవలం నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు కల్పించిన అధికారులు.. బయటకు వస్తే కచ్చితంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. Vizag: ఫార్మా సిటీలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన విశాఖ
తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలు అమలాపురం, కాకినాడలో లాక్డౌన్ పొడిగించారు. ఇక్కడ సైతం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులకు అనుమతి ఉంది. ఆ తర్వాత కేవలం మెడికల్, వైద్య సంబంధిత షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయి. మెడికల్, అత్యావసర, నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను బయటకు రావడానికి అనుమతి ఇచ్చారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు ఒంగోలు, మార్కాపురం, చీరాలలో లాక్డౌన్ ఎత్తివేస్తారని భావించినా తిరిగి కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేసులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
అనంపురంలోనూ లాక్డౌన్ పొడిగించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే రోడ్లపైకి అనుమతించారు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కోసం బయటకు రావొచ్చునని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు.
తొలి నెల రోజుల్లో కరోనా కేసు అంటే కూడా తెలియని శ్రీకాకుళంలో భారీగా కేసులు నమోవుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు ఇప్పటివరకూ లాక్డౌన్ ఉన్న ప్రాంతాల్లో మరికొన్ని రోజులు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..