Sankranti special buses: సంక్రాతికి భారీగా స్పెషల్ బస్సులు- ఛార్జీలు బాదుడు కూడా..!
Sankranti special buses: సంక్రాతి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti special buses: సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ కోసం ఏపీ ప్రజలు దేశంలో ఎక్కడున్న స్వస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC latest news) కీలక నిర్ణయం తీసుకుంది.
పండుగకు బస్సుల్లో ఊరేళ్లేవారికోసం.. 1,266 ప్రత్యేక బస్సులు (Special buses for Sankranti) ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ తెలిపింది. విజయవాడ నుంచి సమీప రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులను నడిపించనున్నట్లు వెల్లడించింది.
స్పెషల్ బస్సులు నడిచే రూట్లు..
ముఖ్యంగా హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ వివరించింది.
ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 362 ప్రత్యేక బస్సులు కేటాయించడం (Sankranti special buses from Hyderabad) గమనార్హం. ఇక చెన్నై ఏపీ మధ్య 20, బెంగళూరు ఏపీ మధ్య 14 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.
ఏపీలో విజయవాడ- విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మధ్య 390 ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. విజయవాడ-రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య 120 ప్రత్యేక బస్సులు నడుస్తాయని వివరించింది. జనవరి 7 నుంచి 14 వరకు ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయని (Sankranti special buses Routes) వెల్లడించింది.
ధరల బాదుడు కూడా..
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ.. ఛార్జీలు పెంచుతున్నట్లు షాకిచ్చింది. సంక్రాంతి సీజన్ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ఛార్జీలు (Sankranti Bus Charges hike) పెంచుతున్నట్లు ప్రకటించింది.
బస్సుల్లో చివరి నిమిషంలో సీటు దొరుకుతుందో లేదో అనే టెన్షన్ లేకుండా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ఏపీ.. ఆర్టీసీ అధికారిక పోర్టల్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
Also read: Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు.. మొత్తంగా ఏపీలో 3 కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook