Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది.
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు. అయితే అందులోనూ ఆ మహిళలకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అంతకు ముందు కెన్యా నుంచి తిరుపతి నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల సదరు మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి ఆమె స్వస్థలమైన తిరుపతికి చేరుకుంది. తిరుపతి వెళ్లిన తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 358కి చేరింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలను విధిగా నిర్వహించి.. ప్రజలను క్వారంటైన్ తప్పనిసరిగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తుంది.
ALso Read: Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కాలు జారీ కింద పడ్డ ఏపీ స్పీకర్!
Also Read: Movie ticket prices issue: ఇష్టానుసారం వసూలు చేస్తామంటే కుదరదు-హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి