Dussehra special buses: దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు.. త్వరలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీ
RTC to run 4,000 special buses: హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు.
APSRTC to run 4,000 special buses for Dussehra festival: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి నుంచి (అక్టోబర్ 8) నుంచి ఈనెల 18వ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఆర్టీసీ ఎండీ (APSRTC MD) సీహెచ్ ద్వారకాతిరుమలరావు (Dwaraka Tirumala Rao) తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 ప్రత్యేక బస్సులు, ఇక 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పనన్నుట్లు తిరుమలరావు (Tirumala Rao) చెప్పారు.
దసరా సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుడదని, వారు తమ స్వస్థలాలకు సులభంగా వచ్చి పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు ఆయన. హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు.
Also Read : MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన
అయితే దసరా ప్రత్యేక బస్సులను ఎలాంటి రాబడి లేకుండా నడపాల్సి ఉంటుందని తెలిపారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల అనివార్య పరిస్థితుల్లో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని కోరారు. అయితే రెగ్యులర్ బస్ సర్వీసుల్లో ఇలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు.
ఇక గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల (andhra employees) వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ (RTC) కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పల్లెవెలుగు బసుల డిజైన్ మారుస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్ సౌలభ్యం కల్పిస్తామన్నారు.
Also Read : Snakes viral videos: రెండేళ్ల పిల్లాడు 2 మీటర్ల పాము తోక పట్టుకుని.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి